'నాకంటే మీరే అందంగా ఉన్నారు..': షారుఖ్ ఖాన్ ఫన్నీ రిప్లై

రిపోర్టర్: శివ స్థలం: ముంబై

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ తనదైన చమత్కార సమాధానాలతో మరోసారి అభిమానులను అలరించారు. సోషల్ మీడియా వేదికగా నిర్వహించిన ఆస్క్ ఎస్సార్‌కే (AskSRK) సెషన్‌లో సాహిల్ ఖాన్ అనే అభిమాని తన దుస్తులు, హెయిర్‌స్టైల్‌ను రేట్ చేయాలని కోరగా.. షారుఖ్ ఖాన్ స్పందిస్తూ తనదైన శైలిలో ఫన్నీగా బదులిచ్చారు. నాకంటే మీరే చాలా అందంగా ఉన్నారు, కాకపోతే నా పోస్టర్ మీద గాలి మాత్రమే కాస్త ఎక్కువగా వీచింది అంటూ షారుఖ్ చేసిన సెల్ఫ్ రోస్ట్ కామెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.