గత పాలనలో ఏపీకి తీవ్ర నష్టం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్వజం
రిపోర్టర్: కృష్ణ
స్థలం: అమరావతి
గత వైఎస్సార్సీపీ పాలనలో జరిగిన విధ్వంసం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. అమరావతిలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జగన్ తీరు వల్ల రాష్ట్రంతో పాటు కుటుంబంలోనూ ఇబ్బందులే తలెత్తాయని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెడుతూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.