భక్తిపారవశ్యంతో విగ్నేశ్వరుడిని దర్శించుకున్న మంత్రి శ్రీధర్ బాబు
రిపోర్టర్: Subhan.Manthani
స్థలం: మంథని
పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని పలు దేవాలయాలు, నడివీధి విగ్నేశ్వర గణపతి మండపాలను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గురువారం సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు సుభిక్షంగా పండాలని గణనాథుడిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు విశేషంగా పాల్గొన్నారు.