వర్షపు నీటితో బురదమయంగా మారిన జన్నారం జాతీయ రహదారి

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని ధర్మారం చౌరస్తా, బస్టాండ్ ప్రాంతాలు వర్షాల కారణంగా బురదమయంగా మారాయి. ఎస్బీఐ బ్యాంకు పరిసర ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో నీరు నిలిచిపోయి గుంతలు ఏర్పడ్డాయి. దీంతో రోడ్డుపై రాకపోకలు సాగించే వాహనదారులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి డ్రైనేజీ సమస్యను పరిష్కరించి రోడ్డును బాగు చేయాలని ప్రజలు కోరుతున్నారు.