సంగారెడ్డిలో రిద్ది వెంచర్ అక్రమాలు: కొండ తవ్వి ప్రభుత్వ భూముల కబ్జా
రిపోర్టర్: విజయ్
స్థలం: సంగారెడ్డి
సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మన్సాన్ పల్లి గ్రామ శివారులో రిద్ది హాబిటేట్స్ వెంచర్ నిర్వాహకులు ప్రకృతి సిద్ధంగా ఉన్న కొండను తవ్వి ప్రభుత్వ భూములను ఆక్రమించినట్లు స్థానికులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. సర్వే నంబర్ల మార్పులతో పాటు అక్రమంగా రోడ్లు, డ్రైనేజీలు నిర్మిస్తున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని, వెంచర్ యాజమాన్యంతో అధికారులు మిలాఖత్ అయ్యారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.