అన్నదాత సుఖీభవ పథకం అమలుపై సీఎం చంద్రబాబు స్పష్టత
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: Andhra Pradesh
అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తామని చెప్పిన మాటను నిలబెట్టుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించినట్లు I&PR AP పేర్కొన్నారు. పల్లె పండుగ సభలో ఈ విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. ఈ బహిరంగ సభ అనంతరం కాకొల్లువారిపల్లె గ్రామంలో పల్లె పండుగ అభివృద్ధి పనులను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సీఎం, డిప్యూటీ సీఎంలకు గ్రామస్థులు పూలుజల్లి ఘనంగా స్వాగతం పలికారని వెల్లడించారు.