టెక్ రంగాన్ని కుదిపేస్తున్న చైనా కృత్రిమ మేధ: అమెరికాకు గట్టి పోటీ

రిపోర్టర్: హరి స్థలం: హైదరాబాద్

అమెరికా ఏఐ ఆధిపత్యానికి చైనా గట్టి సవాల్ విసురుతోందని నిపుణులు సూర్య ప్రకాష్ జోశ్యుల వెల్లడించారు. అమెరికా కంటే చాలా తక్కువ ఖర్చుతో చైనా టెక్ దిగ్గజాలు అత్యుత్తమ ఏఐ మోడళ్లను అభివృద్ధి చేశాయని ఆయన తెలిపారు. ఓపెన్ సోర్స్ విధానంతో అమెరికా టెక్ మార్కెట్ను చైనా మోడళ్లు వణికిస్తున్నాయని, భవిష్యత్తులో ఈ సాంకేతిక యుద్ధం మరింత తీవ్రం కానుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.