ఇరాన్ భవితవ్యంపై త్వరలోనే కీలక నిర్ణయం తీసుకుంటామన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్
రిపోర్టర్: వెంకట్
స్థలం: అమెరికా
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఐరాసలో మాట్లాడుతూ ఇరాన్‌పై యుద్ధం లేదా డీల్ విషయంలో త్వరలోనే తాను కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలిపారు. ఇరాన్‌ను గొప్ప దేశంగా మార్చడమా లేక పూర్తిగా నిర్మూలించడమా అనేది తేల్చాల్సి ఉందన్నారు. అలాగే అన్ని దేశాలు అంతర్జాతీయ నేర న్యాయస్థానం నుంచి తప్పుకోవాలని పిలుపునిచ్చారు. భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని పునరుద్ఘాటించారు. మరోవైపు ఐరాస సమావేశంలో టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ కశ్మీర్ సమస్యను ప్రస్తావించగా భారత్ దానిని తీవ్రంగా ఖండించింది.