మానకొండూరులో దారుణం: ముప్పై ఐదేళ్లుగా ఇందిరమ్మ ఇంటి కోసం నిరుపేద వృద్ధురాలి ఎదురుచూపులు

రిపోర్టర్: రాము స్థలం: కరీంనగర్

కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ఊటూరు గ్రామానికి చెందిన దూడం ప్రమీల కుటుంబం ముప్పై ఐదేళ్లుగా ప్లాస్టిక్ కవర్ల నీడనే జీవనం సాగిస్తోందని, వరుస విషాదాల నేపథ్యంలో తనకు వెంటనే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ అధికారుల చుట్టూ తిరుగుతున్నట్లు గ్రామస్థులు తెలిపారు. భర్త, పిల్లలను కోల్పోయి అభాగ్యురాలిగా మారిన ఈ వృద్ధురాలి దయనీయ పరిస్థితిపై ఇప్పటికైనా యంత్రాంగం స్పందించి తక్షణ సాయం అందించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.