సాహసం చేసిన యువతి: మొబైల్ ఫోన్ లాక్కెళ్లిన దొంగలను వెంబడించి పట్టుకున్న వైనం
రిపోర్టర్: భాస్కర్
స్థలం: New Delhi
ఢిల్లీలో ఖుషి మహేశ్వరి అనే ఇరవైనాలుగు సంవత్సరాల యువతి తన ఐఫోన్ లాక్కెళ్లిన ఇద్దరు దొంగలను తన స్కూటీపై అర్ధ కిలోమీటరు మేర వెంబడించి సాహసోపేతంగా పట్టుకున్నట్లు డిసిపి ఆకాంక్ష యాదవ్ వెల్లడించారు. అశోక్ విహార్ ప్రాంతంలో కాతక్ క్లాస్ ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని, స్థానికుల సహకారంతో నిందితులను పోలీసులకు అప్పగించారని అధికారులు తెలిపారు.