ఇరాన్లో అమెరికా క్షిపణి దాడి: పెళ్లి వేడుకలో ఐదుగురు మృతి
రిపోర్టర్: రాజేష్
స్థలం: World
దక్షిణ ఇరాన్‌లోని హోర్మోజ్గాన్ ప్రావిన్స్‌లో అమెరికా జరిపిన క్షిపణి దాడి తీవ్ర విషాదాన్ని నింపింది. కుహెస్తాక్ గ్రామంలో జరుగుతున్న వివాహ వేడుకపై జరిగిన ఈ దాడిలో నాలుగేళ్ల పసికందుతో సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు, 67 మంది తీవ్రంగా గాయపడ్డారు. అమెరికా బలగాలు కమ్యూనికేషన్ టవర్లను లక్ష్యంగా చేసుకుని జరిపిన దాడిలో భవనం కుప్పకూలడంతో పెళ్లి ఇల్లు శ్మశానంగా మారింది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.