మున్సిపాలిటీల్లో ఆటో మ్యుటేషన్ విధానం అమలుకు సన్నాహాలు
రిపోర్టర్: రాము
స్థలం: నెల్లూరు
పురపాలక సంఘాల్లో ఆస్తుల బదలాయింపు ప్రక్రియలో పారదర్శకత పెంచేలా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కార్యాలయాల చుట్టూ తిరగకుండానే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల ఆధారంగా నేరుగా మున్సిపల్ రికార్డుల్లో వివరాలు అప్‌డేట్ అయ్యేలా ఆటో మ్యుటేషన్ విధానాన్ని అమల్లోకి తెస్తున్నారు. దీనివల్ల లంచాలకు అడ్డుకట్ట పడటంతో పాటు ప్రజలకు సులభంగా సేవలు అందుతాయని అధికారులు తెలిపారు.