ఈ నెల ముప్పై న ప్రేక్షకుల ముందుకు రానున్న రాహుల్ విజయ్ సినిమా
రిపోర్టర్: గోపి
స్థలం: హైదరాబాద్
యువ హీరో రాహుల్ విజయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా సినిమా ఈ నెల ముప్పై వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రంలో రాహుల్ విజయ్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తారని దర్శకుడు సాయి బాలి తెలిపారు. శుక్రవారం విడుదల చేసిన ఈ సినిమా పాట శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంటోందని మేకర్స్ వెల్లడించారు.