యూనివర్శిటీల్ లో వివాహ పూర్వ సన్నద్ధత కోర్సు: గోవా కాలేజీ కీలక నిర్ణయం

రిపోర్టర్: సురేష్ స్థలం: గోవా

జీవితంలో వివాహ బంధం ప్రాముఖ్యతను వివరిస్తూ గోవా కాలేజ్ ఆఫ్ హోమ్ సైన్స్ సరికొత్త సర్టిఫికేట్ కోర్సును ప్రవేశపెట్టిందని ప్రిన్సిపాల్ మహేష్ పై తెలిపారు. కెరీర్ కోసం దశాబ్దాలు కష్టపడే యువత వివాహ జీవితంపై కూడా దృష్టి పెట్టాలని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న విడాకుల కేసులను తగ్గించే లక్ష్యంతో ఈ పదిహేను రోజుల ప్రత్యేక కోర్సును డిసెంబర్ రెండు నుండి నిర్వహించనున్నట్లు కళాశాల యాజమాన్యం వెల్లడించింది.