ముఖ్యమంత్రికి సమీప వ్యక్తి గెస్ట్ హౌస్‌కు రమ్మన్నారంటూ మహిళా వ్యాపారవేత్త ఆరోపణ

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: హైదరాబాద్

అవుట్‌డోర్ అడ్వర్టైజింగ్ వ్యాపార అనుమతుల కోసం సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితుడైన వ్యక్తి తన్ను గెస్ట్ హౌస్‌కు రమ్మని కోరారని హైదరాబాద్‌కు చెందిన మిథున యాడ్స్ వ్యవస్థాపకురాలు కే శోభా రెడ్డి ఎక్స్ వేదికగా సంచలన ఆరోపణలు చేశారు. జీవో నంబర్ 68 కింద నిబంధనల ఉల్లంఘనలు, పారదర్శకత లేమిపై ఆమె ఆవేదన వ్యక్తం చేయగా, ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ నేత క్రిశాంక్ ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబట్టారు.