ఇందిరమ్మ ఇండ్ల పథకానికి పీఎం ఆవాస్ యోజనతో పూర్తి అనుసంధానం

రిపోర్టర్: సునీల్ స్థలం: తెలంగాణ

తెలంగాణలో పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పోర్టల్తో అనుసంధానించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని అధికారులు వెల్లడించారు. ఈ నిర్ణయం ద్వారా లబ్ధిదారులకు రాష్ట్రం అందించే ఐదు లక్షల ఆర్థిక సహాయంతో పాటు కేంద్రం నుంచి ఇరవై రెండు వేల అదనపు నిధులు, ఉపాధి హామీ పథకం లబ్ధి చేకూరనుండటంతో పేద కుటుంబాలకు నిర్మాణ భారం తగ్గనుంది.