అలంపూర్ జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్న ఎస్సీ ఎస్టీ కమిషన్ ఛైర్మన్

రిపోర్టర్: గోపి స్థలం: అలంపూర్

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లోని ప్రసిద్ధ శ్రీ జోగులాంబ అమ్మవారు, శ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు వేద పండితులు, ఆలయ కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారికి, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.