తెలంగాణ సచివాలయంలో నిలిచిపోయిన కీలకమైన ఇంటర్నెట్ సేవలు

రిపోర్టర్: రమేష్ స్థలం: హైదరాబాద్

తెలంగాణ సచివాలయంలో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడంతో పలు శాఖల్లో పౌర సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా మీడియా సెంటర్, పబ్లిసిటీ సెల్, ఎన్ఆర్ఐ అసిస్టెన్సీ సెల్‌లో ఇంటర్నెట్ సేవలు పూర్తిగా పనిచేయకపోవడంతో ప్రభుత్వ కార్యకలాపాలకు తీవ్ర ఆటంకం కలిగింది.