పేదవాడి ఆపద్భాంధవుడిగా నిలిచిన ముఖ్యమంత్రి సహాయనిధి వరం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: ఎచ్చెర్ల

పోలాకి మండలం ఉర్లాం గ్రామానికి చెందిన నడిమింటి దుర్గారావు అనారోగ్య సమస్యలతో బాధపడుతుండగా ప్రభుత్వ పరంగా ఆర్థిక భరోసా లభించింది. ఎచ్చెర్ల నియోజకవర్గంలోని కత్తిరివానిపేట క్యాంపు కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి బాధితునికి సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన లక్షా పదిహేడు వేల ఏడెంచూళ్ల చెక్కును అందజేశారు. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, అనారోగ్యంతో బాధపడే ప్రతి ఒక్క పేద కుటుంబానికి సీఎం సహాయనిధి శ్రీరామరక్షలా అండగా నిలుస్తోందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతి పేద కుటుంబానికి పూర్తిగా చేరే విధంగా నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్యే భరోసానిచ్చారు. ఈ సాయం అందుకున్న అనంతరం బాధితుని కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మరియు ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నాయకులు డోల జగన్, జల్లు చంద్రమౌళి తదితరులు పాల్గొని బాధితునికి అండగా నిలిచారు.