ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు వైఖరిపై భద్రాచలంలో బీఆర్‌ఎస్ భారీ ధర్నా
రిపోర్టర్: శివ
స్థలం: భద్రాద్రికొత్తగూడెం
భద్రాద్రికొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం సీతారామపురంలో ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు వైఖరిని నిరసిస్తూ బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ నాయకుడు మానే రామకృష్ణ మాట్లాడుతూ రోడ్ల దుస్థితి, కమీషన్ల దందాలు, తాలిపేరు ప్రాజెక్ట్ నిర్లక్ష్యంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసిన ఎమ్మెల్యే తీరుపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.