ఘనంగా 'మండాడి' సినిమా బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్!

రిపోర్టర్: హరి స్థలం: తెలంగాణ

సూరి, సుహాస్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘మండాడి’ చిత్రం ఘన విజయం సాధించడంతో చిత్ర యూనిట్ బ్లాక్ బస్టర్ వేడుకలను నిర్వహించింది. తెలుగు ప్రేక్షకులు అందించిన ఆదరణకు హీరోలు సూరి, సుహాస్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సినిమా అన్ని భాషల్లోనూ అద్భుతమైన విజయం సాధించిందని, మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ సహకారంతో ప్రతిచోటా హౌస్‌ఫుల్ ప్రదర్శనలతో దూసుకుపోతోందని మేకర్స్ సంతోషం వ్యక్తం చేశారు.