ఫిరోజాబాద్‌లో నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద మృతి: కాలేజీ ప్రిన్సిపాల్‌పై హత్యానేరం నమోదు
రిపోర్టర్: సురేష్
స్థలం: ఫిరోజాబాద్
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫిరోజాబాద్ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. జీఎన్ఎం మొదటి సంవత్సరం చదువుతున్న పద్దెనిమిదేళ్ల నర్సింగ్ విద్యార్థిని ప్రీతి శవమై తేలడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కళాశాల ప్రిన్సిపాల్ సురేష్ దక్ష్, అతని కుమారుడే తన సోదరిని హత్య చేశారని మృతురాలి సోదరుడు రోహిత్ ఆరోపించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు గురువారం తెలిపారు.