రాహుల్ గాంధీ దేశద్రోహి అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ బీజేపీ

రిపోర్టర్: వెంకట్ స్థలం: న్యూఢిల్లీ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీరు దేశంలో అరాచకానికి, ప్రజాస్వామ్య వ్యవస్థలను బలహీనపరచడానికి దారితీస్తోందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా మండిపడ్డారు. న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాహుల్ రాజకీయ విధానాలు రాజ్యాంగ వ్యతిరేకమని, ఆయనను దేశద్రోహితో పాటు భస్మాసురుడిగా అభివర్ణిస్తున్నామని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు.