'సంక్రాంతి బరిలో రెండు సినిమాలు': మెగాస్టార్ చిరంజీవిపై ట్రెండింగ్ చర్చ
రిపోర్టర్: కృష్ణ
స్థలం: హైదరాబాద్
మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న కాకా సినిమా జనవరి 13న సంక్రాంతి బరిలో దిగడం ఖాయమైంది. అయితే చిరంజీవి నటించిన మరో చిత్రం విశ్వంభర కూడా అదే సంక్రాంతి రేసులోకి వచ్చే అవకాశం ఉందనే ప్రచారం సినీ వర్గాలలో ఆసక్తికరంగా మారింది. ఒకే హీరో నటించిన రెండు సినిమాలు ఒకే పండుగ సీజన్లో విడుదల కావడం చాలా అరుదు కాగా, ఈ ప్రచారంపై మూవీ యూనిట్ నుంచి అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.