విద్యుదాఘాతంతో కిరాణా దుకాణం దగ్ధం ముప్పై లక్షల నష్టం
రిపోర్టర్: సతీష్
స్థలం: మెదక్
మెదక్ జిల్లా శివ్వంపేటలో గురువారం ఉదయం విద్యుదాఘాతంతో కంటాల హన్మంత్ గుప్తాకు చెందిన హోల్ సేల్ కిరాణా దుకాణం దగ్ధమైంది. రిఫ్రిజిరేటర్ పేలడంతో మంటలు చెలరేగి సుమారు రూ. 30 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితులు వాపోయారు. నర్సాపూర్ అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. భవనం పైకప్పుపై యజమాని కుటుంబం నివసిస్తుండటంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.