ఓటర్ల జాబితా సవరణపై దుమారం: అసలు వాస్తవాలు వెల్లడించిన సుర్జిత్ భల్లా
రిపోర్టర్: అశోక్
స్థలం: న్యూఢిల్లీ
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా తొలగించిన కోట్ల ఓట్లలో అధిక భాగం మరణించిన వారు, వలస వెళ్లిన వారేనని ప్రముఖ ఆర్థికవేత్త సుర్జిత్ భల్లా స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన తన తాజా విశ్లేషణలో తెలిపారు. దేశవ్యాప్తంగా జరిగిన తొలగింపులలో ఎనిమిదింటిలో ఏడు పూర్తిగా సమర్థించదగినవేనని పేర్కొంటూ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మాత్రం దాదాపు యాభై లక్షల మంది అర్హులైన ఓటర్ల పేర్లు ఎలాంటి సరైన వివరణ లేకుండా తొలగించబడ్డాయని ఆయన తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేశారు.