నాగర్‌కర్నూల్‌లో అరుదైన చారిత్రక ఐశ్వర్య గణపతి విగ్రహం

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: నాగర్‌కర్నూల్

తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం ఆవంచ గ్రామంలో సుమారు 12వ శతాబ్దానికి చెందిన చారిత్రక ఐశ్వర్య గణపతి విగ్రహం ఉంది. పచ్చని పంట పొలాల మధ్య 30 అడుగుల ఎత్తు, 15 అడుగుల వెడల్పుతో ఉన్న ఈ ఏకశిలా విగ్రహం పశ్చిమ చాళుక్యుల కాలం నాటి శిల్పకళా వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది. సరైన అభివృద్ధి చేస్తే ఇది ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారుతుంది.