రేవంత్ రెడ్డికే నా మద్దతు: అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు

రిపోర్టర్: గోపి స్థలం: హైదరాబాద్

సైదాబాద్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ, సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు. కాంగ్రెస్ పార్టీకి కాకుండా, రేవంత్ వ్యక్తిత్వానికే తన మద్దతు అని అసద్ స్పష్టం చేశారు. రేవంత్ దూకుడును అడ్డుకోలేకనే కేసీఆర్ ఓడిపోయారని ఆయన వ్యాఖ్యానించారు. అసద్‌ను దేశభక్తుడిగా అభివర్ణించిన రేవంత్, పాతబస్తీ అభివృద్ధికి నిధుల విడుదలకు అధికారులను ఆదేశించారు. ఈ పరిణామం తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీస్తోంది.