ఢిల్లీలో కొనసాగుతున్న ఆందోళనలు: కేంద్ర బలగాల మోహరింపు పొడిగింపునకు పోలీసుల లేఖ
రిపోర్టర్: సురేష్
స్థలం: ఢిల్లీ
ఢిల్లీలో విపక్షాల ఆందోళనల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం కేంద్ర సాయుధ పోలీసు బలగాల మోహరింపును ఈ నెల 20వ తేదీ వరకు పొడిగించాలని కేంద్ర హోంశాఖను ఢిల్లీ పోలీసులు కోరినట్లు ఉన్నతాధికారులు మంగళవారం వెల్లడించారు. ఓటర్ల జాబితా సవరణపై నిరసనలు పెరుగుతున్నందున కీలక ప్రాంతాల్లో నిఘా పెంచామని, అదనపు బలగాల అవసరం ఉందని వారు లేఖలో స్పష్టం చేశారు.