వాట్సాప్ మెసేజ్‌లతో సైబర్ మోసాల పట్ల పల్నాడు పోలీసుల హెచ్చరిక
రిపోర్టర్: కృష్ణ
స్థలం: పల్నాడు
కొత్త తరహా సైబర్ నేరాల పట్ల ప్రజలు తీవ్ర అప్రమత్తంగా ఉండాలని పల్నాడు పోలీసు శాఖ హెచ్చరించింది. వాట్సాప్‌లో డబ్బులు కట్ అయ్యాయని, లావాదేవీ మీరు చేయకపోతే 'నో' అని రిప్లై పంపాలని వచ్చే మోసపూరిత మెసేజ్‌లకు ఎవరూ స్పందించవద్దని స్పష్టం చేశారు. ఒకవేళ ఆ మెసేజ్‌కు రిప్లై ఇస్తే ఫోన్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సైబర్ మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండి పోలీసులకు సమాచారం అందించాలని పల్నాడు పోలీసులు వెల్లడించారు.