సంక్షేమ హాస్టళ్ల టెండర్లలో భారీ అవినీతి: డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ మండిపాటు
రిపోర్టర్: అశోక్
స్థలం: కుమ్రం భీమ్ ఆసిఫాబాద్
సంక్షేమ హాస్టళ్ల నిత్యావసర సరుకుల సరఫరాలో కేంద్రీకృత టెండర్ల పేరిట భారీగా కమీషన్ల దందా సాగుతోందని డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ (సిర్పూర్) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నాకాఫ్కి టెండర్ దక్కించుకున్న సంస్థ సబ్ కాంట్రాక్టర్లకు పనులు అప్పగిస్తూ నిబంధనలకు విరుద్ధంగా వసూళ్లకు పాల్పడుతోందని ఆరోపించారు. దీనివల్ల నాసిరకం సరుకులు అంది విద్యార్థుల ఆరోగ్యం దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేస్తూ, ఈ అక్రమాలపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.