పురపాలికలకు రూ.కోట్లలో బడ్జెట్: విజయనగరం జిల్లాలో భారీగా అభివృద్ధి నిధుల కేటాయింపు

రిపోర్టర్: రాజేష్ స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లాలోని పురపాలికలు మరియు నగరపాలక సంస్థ 2026-27 ఆర్థిక సంవత్సరానికి భారీ అంచనా బడ్జెట్ను ప్రకటించాయి. విజయనగరం నగరపాలక సంస్థతో పాటు రాజాం, బొబ్బిలి పురపాలికలు, నెల్లిమర్ల నగరపంచాయతీ బడ్జెట్లను రూ.200 కోట్లకుపైగా రూపొందించాయి. పట్టణాల్లో రోడ్లు, కాలువలు, తాగునీరు, సెంట్రల్ లైటింగ్ వంటి మౌలిక వసతుల కల్పనకు అధికారులు పెద్దపీట వేశారు. సొంత వనరులు, ఆర్థిక సంఘం నిధులతో ఈ అభివృద్ధి పనులను పూర్తి చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.