భారత్ స్థాయిని చేరుకోవడానికి పాక్ ఇంకా చాలా ప్రయాణించాలి
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: పాకిస్తాన్
భారత క్రికెట్ జట్టుతో తలపడాలంటే పాకిస్తాన్ జట్టు ఇంకా ఎంతో దూరం ప్రయాణించాల్సి ఉందని ఆ జట్టు హెడ్ కోచ్ మైక్ హెస్సన్ స్పష్టం చేశారు. ఆసియన్ గేమ్స్ టోర్నమెంట్లో పాల్గొనేందుకు కరాచీ నుంచి జపాన్‌కు బయలుదేరే ముందు ఆయన మాట్లాడుతూ వైట్ బాల్ క్రికెట్లో భారత్ ప్రస్తుతం అత్యున్నత ప్రమాణాలను కలిగి ఉందని, ఆ స్థాయిని చేరుకోవడమే తమ ప్రధాన సవాల్ అని అభిప్రాయపడ్డారు.