ప్రకాశం జిల్లాలో దారుణం: ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి హతమార్చిన కామాంధుడు
రిపోర్టర్: శివ
స్థలం: ప్రకాశం
ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలో అవాంఛనీయ ఘటన చోటుచేసుకుంది. అర్ధరాత్రి సమయంలో ఇంటి బయట నిద్రిస్తున్న ఆరేళ్ల బాలికను ఆనంద్ అనే వ్యక్తి కిడ్నాప్ చేసి అత్యాచారం జరిపి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ అమానుష ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన స్థానికులు, కుటుంబసభ్యులు జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేయగా, పోలీసులు వెంటనే స్పందించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.