అమ్రాబాద్ అభయారణ్యంలో పెద్ద పులుల సందడి: సఫారీకి వెళ్లిన పర్యాట్కులకు ఎదురుగా సంచారం

రిపోర్టర్: వెంకట్ స్థలం: అమ్రాబాద్

అమ్రాబాద్ అభయారణ్యంలో ఆదివారం పెద్ద పులులు సంచరించి సందడి చేశాయని అటవీ అధికారులు తెలిపారు. శ్రీశైలం ప్రధాన రహదారిపై ఉన్న ఫరహాబాద్ చౌరస్తా నుంచి సఫారీకి వెళ్లిన పర్యాట్కులకు తిరుగు ప్రయాణంలో మార్గమధ్యలో ఒకదాని వెనుక ఒకటి వెళ్తున్న పులులు కనిపించాయి. తల్లి పులితో పాటు దాని పిల్లలు అయి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ అరుదైన దృశ్యాన్ని చూసి పర్యాట్కులు ఎంతగానో ఆనందం వ్యక్తం చేశారు.