రాజ్యాంగ సంస్థలను అప్రతిష్టపాలు చేస్తున్నారంటూ విపక్షాలపై సంబిత్ పాత్రా ఫైర్

రిపోర్టర్: మహేష్ స్థలం: New Delhi

ఎన్నికల సంఘంతో పాటు దేశంలోని ఏ రాజ్యాంగ సంస్థ కూడా నియంతృత్వ పాలనలో లేదని, అవి ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేస్తున్నాయని బీజేపీ సీనియర్ నేత డాక్టర్ సంబిత్ పాత్రా స్పష్టం చేశారు. ఎస్‌ఐఆర్ (SIR) నిర్వహణ విషయంలో పూర్తి ప్రజాస్వామ్యబద్ధమైన చర్చల తర్వాతే ఎన్నికల సంఘం ఏకగ్రీవ నిర్ణయం తీసుకుందని ఆయన వెల్లడించారు. ఎన్నికల్లో ప్రజలచే తిరస్కరించబడిన విపక్షాలు కేవలం తమ ఓటమి నైరాశ్యంతోనే రాజ్యాంగ సంస్థలపై బురదజల్లుతున్నాయని మండిపడ్డారు.