చిన్నారుల ముఖాల్లో చిరునవ్వులు పూయించిన ఉచిత యూనిఫామ్ కిట్లు
రిపోర్టర్: Narendra kumar kinnera
స్థలం: ఖమ్మం రూరల్
ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా గురువారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రీ ప్రైమరీ విద్యార్థులకు యూనిఫామ్ కిట్లను అందజేశారు. ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చిందని, విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలతో పాటు యూనిఫామ్‌లను ఉచితంగా అందిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు.