ఖైరతాబాద్‌లో సర్వే కలకలం: కేసీఆర్ పాలనకే మెజారిటీ ప్రజల మద్దతు
రిపోర్టర్: మహేష్
స్థలం: హైదరాబాద్
ఖైరతాబాద్‌లో ఆర్ఆర్ సంస్థ నిర్వహించిన తాజా సర్వేలో రాష్ట్ర రాజకీయాలపై కీలక విషయాలు వెల్లడయ్యాయని సర్వే నిర్వాహకులు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని సుమారు యాభై మూడు శాతం పైగా ప్రజలు కోరుకుంటున్నట్లు సర్వేలో స్పష్టమైంది. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనకు ఇరవై శాతం మంది మాత్రమే మద్దతు తెలపడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.