కేసీఆర్పై నిరాధార ఆరోపణలు: వెలుగు పత్రికపై మహేష్ బిగాల ఆగ్రహం
రిపోర్టర్: మహేష్
స్థలం: హైదరాబాద్
కేసీఆర్ ప్రతిష్ఠను దెబ్బతీసేలా వెలుగు పత్రికలో కథనం ప్రచురితమైందని బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్ఆర్ఐ విభాగం కోఆర్డినేటర్ మహేష్ బిగాల మండిపడ్డారు. ఆధారాలు చూపకుండా సంచలనాత్మక శీర్షికలతో ప్రజల్లో అపోహలు సృష్టించడం సమర్థనీయం కాదని ఆయన స్పష్టం చేశారు. వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకొని ఇరవై నాలుగు గంటల్లోగా బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టులపై ఆధారాలతో చర్చకు సిద్ధమని, కేసీఆర్పై నిరాధార ప్రచారాన్ని సహించేది లేదని ఆయన తీవ్రంగా హెచ్చరించారు.