అస్సాం క్రీడాకారిణి సంచలనం: జాతీయ కరాటే ఛాంపియన్షిప్లో స్వర్ణం సాధించిన జన్మోని
రిపోర్టర్: విజయ్
స్థలం: Jorhat
అస్సాం రాష్ట్రానికి చెందిన పదిహేడేళ్ల యువ కరాటే క్రీడాకారిణి జన్మోని కొన్వర్ జాతీయ స్థాయిలో స్వర్ణ పతకం సాధించినట్లు ఆమె కోచ్ సుసంత దాస్ తెలిపారు. దిల్లీలోని తల్కటోరా ఇండోర్ స్టేడియంలో జరిగిన పోటీల్లో ఆమె ఈ ఘనత సాధించారు. వరదలు ఇల్లు కొట్టుకుపోయినా, తీవ్ర పేదరికం వెంటాడినా ఆమె పట్టుదలతో ఈ అరుదైన విజయం సొంతం చేసుకున్నారని కుటుంబ సభ్యులు గర్వంగా వెల్లడించారు.