పాలకొండ సమగ్ర అభివృద్ధే ధ్యేయమంటూ ప్రచారంలో దూసుకెళ్లిన పాలవలస ఇందుమతి
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: పాలకొండ
పాలకొండ నగర పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పదమూడో వార్డులో ఛైర్పర్సన్ అభ్యర్థి పాలవలస ఇందుమతి విస్తృత ప్రచారం నిర్వహించారు. స్థానిక కౌన్సిలర్ అభ్యర్థి గిరిజల ఉమాకు మద్దతుగా ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాదంతో గెలిచి పట్టణాన్ని సర్వతోముఖాభివృద్ధి దిశగా నడిపిస్తానని స్పష్టం చేశారు.