విజయనగరం నియోజకవర్గాలపై టీడీపీ కీలక సమన్వయ సమావేశం

రిపోర్టర్: నరేష్ స్థలం: విజయనగరం

విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు మరియు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లతో సమన్వయ సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ సభ్యుల నివాసంలో జరిగిన ఈ సమావేశంలో అదితీ గజపతి రాజుతో పాటు పలువురు ముఖ్య నేతలు పాల్గొని పార్టీ బలోపేతంపై చర్చించారు.