ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై హైకోర్టు సంచలన అనర్హత వేటు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: హైదరాబాద్
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచి కాంగ్రెస్ పార్టీ నుంచి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన దానం నాగేందర్, 2024 ఏప్రిల్ 23 నుంచి ఎమ్మెల్యేగా కొనసాగడానికి అర్హుడు కాదని డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. స్పీకర్ తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన కోర్టు, ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసిన నాటి నుంచే ఆయనపై అనర్హత వర్తిస్తుందని తేల్చిచెప్పింది.