రేవంత్‌ను బ్లాక్‌మెయిల్ చేయాల్సిన అవసరం లేదు: మహేష్ కుమార్ గౌడ్
రిపోర్టర్: రాము
స్థలం: తెలంగాణ
కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించడం బాధాకరమే అయినా, క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని ఎవరూ బ్లాక్‌మెయిల్ చేయాల్సిన అవసరం లేదని, క్రమశిక్షణా సంఘం నివేదిక ఆధారంగానే హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. సురేఖ కాంగ్రెస్‌లోనే కొనసాగాలని కోరుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.