టెక్ ప్రపంచంలో కలకలం: కేవలం మూడు గంటల్లో ఏఐ టూల్ పూర్తి చేసిన పని
రిపోర్టర్: విజయ్
స్థలం: హైదరాబాద్
కృత్రిమ మేధస్సు టూల్స్ వల్ల ప్రవేశ స్థాయి ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉందంటూ ఒక రెడిట్ వినియోగదారుడు ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం మూడు గంటల్లోనే నాలుగి వేల రూపాయల విలువైన స్టాక్ విశ్లేషణ పనిని క్లాడ్ అనే ఏఐ టూల్ పూర్తి చేసిందని ఆయన తెలిపారు. కాలేజీ విద్యార్థి పది రోజులు చేసే పనిని ఇది ఇట్టే ముగించిందని, భవిష్యత్తులో ఫ్రెషర్లకు ఉద్యోగాలు దొరకడం కష్టమని ఆయన పేర్కొన్నారు.