భక్తిపారవశ్యంతో పులకించిన దేవరపల్లి గ్రామ వినాయక మండపాలు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: జి.కె.వీధి
అల్లూరి సీతారామరాజు జిల్లా జి.కె.వీధి మండలం దేవరపల్లి గ్రామంలో సోమవారం వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. మొట్టడం వారి కుటుంబం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో ఉదయం నుండి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారికి పూజలు, అభిషేకాలు చేశారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ వేడుకల్లో గ్రామ పెద్దలు, యువకులు అధిక సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు.