మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హర్షం
రిపోర్టర్: సునీల్
స్థలం: అమరావతి
మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్ లో కూటమి అభ్యర్థులకు దక్కిన అఖండ విజయాలు ప్రభుత్వ పాలనకు లభించిన మద్దతుగా భావిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈవీఎంలయినా, బ్యాలెట్ అయినా ప్రజలు కూటమి పక్షానే ఉన్నారని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు సహకారంతో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.