పెద్దాపురం ఎన్నికల భద్రత: పోలీసు సిబ్బందికి సీఐ వైఆర్కే శ్రీనివాస్ దిశానిర్దేశం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: పెద్దాపురం
పెద్దాపురం మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీసులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. సర్కిల్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో సీఐ వైఆర్కే శ్రీనివాస్ సిబ్బందికి భద్రతా విధివిధానాలపై తగిన సూచనలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ యు. పాపారావుతో పాటు పలువురు స్థానిక పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.