స్థానిక ఎన్నికల సన్నద్ధతపై విశాఖపట్నం రేంజ్ ఐజీపీ సమీక్ష

రిపోర్టర్: శివ స్థలం: శ్రీకాకుళం

స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత, నేర నియంత్రణ, మహిళల భద్రత, రోడ్డు భద్రత మరియు గంజాయి నిర్మూలనపై విశాఖపట్నం రేంజ్ ఐజీపీ శ్రీ గోపీనాథ్ జట్టి ఆధ్వర్యంలో అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించినట్లు శ్రీకాకుళం జిల్లా పోలీస్ శాఖ వెల్లడించింది. విశాఖపట్నంలో జరిగిన ఈ సమావేశంలో రాబోయే ఎన్నికల నిర్వహణకు తీసుకోవాల్సిన ముందస్తు భద్రతా చర్యలపై పోలీసు అధికారులకు దిశానిర్దేశం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు క్షేత్రస్థాయిలో అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసినట్లు తెలిపారు.