మారేడుమిల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం, యువకుడు మృతి

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: అల్లూరి సీతారామరాజు

అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలంలో లారీని ఆటో ఢీకొన్న ఘటనలో ఒక గిరిజన యువకుడు మృతి చెందాడు. వారపు సంత ముగించుకుని వెళుతుండగా జరిగిన ఈ ప్రమాదంలో మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను రంపచోడవరం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.